Vijay Deverakonda : వారే ఇండస్ట్రీని నిలబెడతారు.. విజయ్ దేవరకొండ కీలక కామెంట్స్..

Vijay Deverakonda : వారే ఇండస్ట్రీని నిలబెడతారు.. విజయ్ దేవరకొండ కీలక కామెంట్స్..
X

సూపర్ హిట్ చిత్రాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో స్టార్డమ్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ఇటీవల వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతని తాజా సినిమా కింగ్ డమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మే 30న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా బాలీవుడ్ ఎదుర్కొంటోన్న ఇబ్బందులను ఉద్దేశించి విజయ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇక్కడి సినిమాలకు ఆదరణ పెరిగింది. ఒకప్పుడు ఈ చిత్రాలను పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు ఆ గుర్తింపు కోసం కష్ట పడుతోంది. ఇదంతా ఇదొక సర్కిల్ లాంటిది. రానున్న రోజుల్లో పరిస్థితులు మారవచ్చు. బాలీవుడ్లో ఆ లోటును తీర్చేందుకు త్వరలోనే కొత్త డైరెక్టర్లు పుట్టుకొస్తారు. హిందీ చిత్రపరిశ్రమ గొప్ప దర్శకులను ప్రేక్షకులకు అందించనుందని నమ్ముతున్న. కాకపోతే వారు.. ముంబైకి సంబంధం లేకుండా బయటవారే అయి ఉంటారని అనిపిస్తోంది' అని విజయ్ దేవరకొండ అన్నారు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్న విజయ్.. తాజాగా బాలీవుడ్ పై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇలాంటి సందర్భంలో విజయ్ ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనేది ఎంతోమంది ఓపినియన్. ఈ మాటలు కాంట్రవర్సీగా మారితే.. విజయ్ కి లేనిపోని తలనొప్పి రావచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం విజయ్ చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి తప్పు లేదని సమర్థిస్తున్నారు.

Tags

Next Story