Parvathi Melton : తన కెరీర్ పాడవడానికి వారే కారణం : పార్వతి మెల్టన్

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వరుస ఆఫర్లతో అందివచ్చిన అవకాశాలను వాడుకుని స్టార్ నటిగా పేరు తెచ్చుకుంటారు. కొందరు సరైన అవకాశాలు రాక, సరైన లక్ లేక మధ్యలో సినిమాలకు బ్రేక్ చెప్పేస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తుంది హీరోయిన్ పార్వతి మెల్టన్. 2005లో టాలీవుడ్ డైరెక్టర్ దేవ కట్టా డైరెక్షన్ లో తెరకెక్కిన వెన్నెల మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ అంతా సక్సెస్ కాలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా, దూకుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ భామ. ఇక మలయాళంలోనూ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజాగా తన కేరీర్ పై పార్వతి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ పాడవడానికి కారణం ఇద్దరు డైరెక్టర్స్ అని చెప్పుకొచ్చింది కానీ వారి పేర్లు చెప్పలేదు. అయితే పార్వతీ మెల్టన్ సినీ కెరీర్ నాశనం అవ్వడానికి అప్పట్లో కొంతమంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి.ఆ డైరెక్టర్లు ఎవరో సినీ ఇండస్ట్రీ గురించి తెలిసిన చాలా మందికి తెలుసు. ఇక పార్వతి మెల్టన్ 2013లో శంసులాలాని ని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com