salaar part 1 : 'వాళ్ళకి ఒక్క కూడా ఫ్లాప్ లేదా..': ప్రభాస్ పరాజయాలపై ప్రశాంత్ నీల్

salaar part 1 : వాళ్ళకి ఒక్క కూడా ఫ్లాప్ లేదా..: ప్రభాస్ పరాజయాలపై ప్రశాంత్ నీల్
ప్రభాస్ ప్లాఫ్స్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్' దర్శకుడు, ప్రశాంత్ నీల్, ఒక ఇంటర్వ్యూలో, తన రాబోయే యాక్షన్ గురించి ఓపెనప్ అయ్యాడు. ప్రభాస్ ఇటీవలి బాక్సాఫీస్ పరాజయాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'KGF : చాప్టర్ 1' సాధించిన విజయాన్ని సాలార్ పునరావృతం చేస్తున్నాడా అనే దాని గురించి మాట్లాడిన ఆయన.. ''నేను ఒక కథను వ్రాసాను, దాన్ని అమలు చేసాను. ఇది ('సాలార్') పాన్-ఇండియా సినిమా అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ అది పాన్-ఇండియా సినిమాగా మారితే, అది మనందరికీ కంప్లీట్ బోనస్. ఇది కూడా 'కేజీఎఫ్' లా చాలా ఆర్గానిక్‌గా జరిగింది'' అన్నారు.

''ఆర్గానిక్‌గా జరిగే సినిమాలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. మీరు పాన్-ఇండియా సినిమాని తీయడానికి ప్లాన్ చేయలేరు, మీరు ప్లాన్ చేసి ఈ నటీనటులను ఈ పరిశ్రమ నుండి పాన్-ఇండియా సినిమాగా తీయడానికి నేను తీసుకురాబోతున్నాను అని చెప్పలేరు. అది అలా వర్కవుట్ కాదు'' అన్నారాయన. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌తో సహా ఇటీవల విడుదలైన ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద విఫలమైనట్లు అంగీకరిస్తూ, ''ప్రభాస్ పెద్ద స్టార్. 'బాహుబలి' తర్వాత బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగాడు. ఇలాంటివి ప్రజలు మరిచిపోరు. స్టార్స్ ఎల్లప్పుడూ స్టార్సే; వారు ఒక ఫ్లాప్ లేదా 20 ఫ్లాప్‌లను కలిగి ఉండవచ్చు, వారు కేవలం ఒక హిట్ ఇవ్వాలి. ఇటీవల, షారుఖ్ ఖాన్ మనకు స్టార్ ఎప్పుడూ స్టార్ అని చూపించాడు, దాన్ని కొట్టిపారేయలేం'' అని చెప్పాడు.

'సాలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్' గురించి :

'కేజీఎఫ్ (KGF)' రచయిత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం 'సాలార్'. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు వంటి స్టార్స్ కనిపించనున్నారు. ఇక సాలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story