Shobhita : మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ: శోభిత

‘తండేల్’ రిలీజ్ సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభిత మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారని, చేస్తున్నన్ని రోజులు పాజిటివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అంటూ చైతూను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్‌లోనే ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 4న వీరి వివాహమైన సంగతి తెలిసిందే. ఇక భార్య తనను ఉద్దేశించి చేసిన పోస్టుపై నాగచైతన్య స్పందించారు. "థ్యాంక్యూ మై బుజ్జి తల్లి" అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్టు కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై మీ బాండింగ్ చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తండేల్ సినిమా విషయానికొస్తే.. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా నటించారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో తండేల్ మోత మోగింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, ఆన్ లైన్ వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది. తొలిరోజే తండేల్ చూడాలని కుతూహలంగా ఉంది ప్రేక్షకలోకం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com