Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా టర్నింగ్ పాయింట్ ఇదే

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా టర్నింగ్ పాయింట్ ఇదే
X

మిల్కీ బ్యూటీ తమన్నా తన మనసులోని మాటను షేర్ చేసుకుంది. పంజాబీ భామ తమన్నా భాటియా దక్షిణాదిలోనూ తనదైన ముద్ర వేసుకుంది. ఐటమ్ సాంగ్స్లోనూ తనకంటూ ప్ర త్యేక గుర్తింపు తెచ్చుకుంది. రెండు దశాబ్దాలుగా అగ్రకథానాయికగా రాణించిన తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. వ్యక్తిగత కారణాల వల్లనో ఆమె కెరీర్లో కొంత బ్రేక్ పడింది. స్పెషల్ సాంగ్స్ తప్పించి చెప్పుకోతగ్గ పాత్రలు రావడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన టర్నింగ్ పాయింట్ ఏమిటో చెప్పేసింది. తన మనసు ఏది చెబుతుందో అదే చేస్తానని, అలసటగా ఉన్నా.. నిద్ర సరిగా లేకపోయినా తీసుకుంటానంటోంది. తనకు ప్ర లు, ధ్యానం చేయడం, దేవాలయా చాలా ఇష్టమని చెప్పింది. కాశీ జీవితంలో మర్చిపోలేని అనుభ ఆ నగరంలోని ఆధ్యాత్మిక వాతావరణం తన మనసును ఎంతగానో ఆకట్టుకుందని తెలిపింది. తనపై గ్లామరస్ నటి ముద్ర వేసేశారని, కెరీర్ ప్రారంభంలోనే కొన్ని నిబంధనలు పెట్టు కోవడంతో మంచి పాత్రలను కోల్పోయానని తెలిపింది. నోకిస్ పాలసీని కఠినంగా పాటించానని తెలిపింది. ఆ ఆంక్షలు వదిలేసిన తర్వాత బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్స్ చేయడం మొదలెట్టానని, అదే తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పింది. వర్కవుట్ మానేసి విశ్రాంతి శాంతమైన ప్రదేశాలకు వెళ్లడం మంచిదంది.

Tags

Next Story