Ruhani Sharma : ఆలోచనలు కవిత్వంగా..రుహానీ శర్మ పోయెటిక్ క్యాప్షన్

చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రుహానీ శర్మ, ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసింది ఈ సిమ్లా సుందరి. 'డర్టీ హరి' లాంటి బోల్డ్ మూవీలో అద్భుత పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రంలో మరోసారి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కంటెంట్ ప్రాధాన్యత చిత్రాల్లోనే నటిస్తుంది. ఈ నేచురల్ బ్యూటీ సోషల్ మీడియాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రుహానీ తాజా ఫొటోషూట్ నెట్టింటా గుబులు రేపుతోంది. ఈ భామ బ్లేజర్ లో మరోసారి తనలోని బోల్డ్ యాంగిల్ ని బయటపెట్టింది. దీనికి 'వెలుగు నీడల మధ్య కొట్టుకు పోవడం, ఆలోచనలు కవిత్వంగా మారడం' అంటూ పోయెటిక్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతోంది. రుహానీ ఈ గెటప్ లో స్టన్నింగ్ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com