Ruhani Sharma! : రుహానీ శర్మకి కాలం కలిసి రాలే!

రుహానీ శర్మ.. చిలాసౌ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ. చిలసౌ తర్వాత హిట్ ఫస్ట్ కేస్ లో నటించిన అమ్మడు అది పర్వాలేదు అనిపించుకున్నా నెక్స్ట్ కథల ఎంపికలో కాస్త ట్రాక్ తప్పింది. డర్టీ హరి సినిమా చేసిన అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అవసరాల శ్రీనివాస్ చేసిన నూటొక్క జిల్లాల అందగాడు చేసినా లాభం లేకుండా పోయింది. రుహాని శర్మ సినిమాలు చేస్తున్నా పాపులారిటీ తెచ్చుకోలేక పోయింది. హర్ చాప్టర్ 1, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ ఇలా చెప్పడానికి కెరీర్ లో చాలా సినిమాలు ఉన్నాయి కానీ అందులో ఏదీ ఆమెకు సరైన గుర్తింపు తీసుకు రాలేదు. దీంతో ఆమె గ్రాఫ్ ని పడి పోయింది. తెలుగులో ఒకసారి కెరీర్ డౌన్ అయితే మళ్లీ ఊపందుకోవడం చాలా కష్టం. ఒకటి రెండు కాదు రెండేళ్లలో రుహాని చాలా సినిమాల్లో అసలేమాత్రం ఇంపార్టెంట్ లేని పాత్రలు చేసింది. వాటి ఎఫెక్ట్ ఈ అమ్మడి కెరీర్ మీద పడింది. ప్రస్తుతం అమ్మడు తమిళ్ లో మాస్క్ సినిమా చేస్తుంది. తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుందా..? లేదా? అన ప్రశ్నికు కాలమే సమాధానం చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com