Tina Dutta : తల్లికావడానికి పెళ్లితో పనేంటి? : టీనా దత్త

ఉత్తరన్ సీరియల్ తో పాపులరైన నటి టీనా దత్త. ప్రస్తుతానికి సింగిల్ గానే ఉంది. ఫ్యూచర్ లో కూడా తనకు ఎవరితో కలిసే ఆలోచన లేదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి టీనా రీసెంట్ గా మాట్లాడింది. సింగిల్ గా తల్లి కావడానికి తన కెలాంటి అభ్యంతరం లేదని, తల్లి కావడానికి పెళ్లి చేసుకో నక్కర్లేదని టీనా అంటోంది. పెళ్లి చేసుకోవడానికి కూడా తాను తొందరపడట్లేదని, కానీ ఫ్యూచర్ లో మాత్రం దత్తత తీసుకునో లేదా సరోగసీ ద్వారానో తల్లి కావాలని చూస్తున్నట్టు టీనా తెలిపింది. తాను మంచి తల్లిని కాగ లనని నమ్ముతున్నానని, సరైన టైమ్ వచ్చినప్పుడు ప్రూప్ చేసుకుంటానని టీనా దత్తా చెప్పుకొచ్చింది. సుస్మితా సేను పెద్ద ఫ్యాన్ అని చెప్తున్న టీనా, ఆమె ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకోవడం చూసే తాను కూడా ఆ దారిలో వెళ్లాలను కుంటున్నట్టు తెలిపింది. భర్త అవసరం లేకుండానే పిల్లల్ని కనగలనని, పెంచగలనని టీనా అభిప్రాయపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com