Prabhas 25th Movie : కొరియన్ బ్యూటీతో ప్రభాస్..!
Prabhas 25th Movie : బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాడు. అందులో భాగంగానే ప్రభాస్ 25వ చిత్రం 'స్పిరిట్' సందీప్ వంగ డైరెక్షన్‌లో తెరకెక్కబోతుంది. ఈ సినిమాని టీ సిరీస్, వంగా పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
ఇదిలావుండగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకి అదేంటంటే.. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో(Song Hye-Kyo)ను ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించారని, ఆమెకూడా ప్రభాస్ తో మూవీ చేసేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com