ఐ బొమ్మ రవి ఇంత చేశాడా.. వాళ్లందరి డేటా నిజంగానే అమ్మేశాడా..?

ఐ బొమ్మ రవి అరెస్ట్‌తో టాలీవుడ్ ఇప్పటికీ పెద్ద షాక్‌లో ఉంది. పైరసీ ప్రపంచంలో అతడి పాత్రను గతంలో ఎన్నో సార్లు సినీ ప్రముఖులు చెప్పినా.. ఇప్పుడు దొరికిన తర్వాత అతడు చేసిన నష్టం ఎంతవరకూ వెళ్లిందనే విషయంపై పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను అమ్మేశాడని స్వయంగా సీపీ సజ్జనార్, రాజమౌళి చెప్పడంతో సామాన్య జనాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో సీపీ సజ్జానార్, దర్శకధీరుడు రాజమౌళి, చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు చేసిన కామెంట్లు ఓ సెన్సేషన్ అవుతున్నాయి. ఐ బొమ్మ సైట్‌ను సందర్శించిన లక్షలాది మంది యూజర్ల డేటాను రవి వ్యాపారంగా మార్చాడని వీళ్లు బయట పెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ “సినిమా ఇండస్ట్రీ సంవత్సరాల కష్టాన్ని రవి దోచుకున్నాడు” ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అని వ్యాఖ్యానించారు. అయితే సజ్జనార్, రాజమౌళి మాట్లాడుతూ.. యూజర్ల డేటాను రవి అమ్ముకున్నాడని.. ఐ బొమ్మ వల్ల ఇండస్ట్రీ కంటే సామాన్య జనాలకే ఎక్కువ నష్టం అని తెలిపారు. ఐబొమ్మ వంటి పైరసీ సైట్లకు వెళ్లి సినిమాలు డౌన్‌లోడ్ చేసే సమయంలో యూజర్ల డేటా సేకరించే అవకాశం ఎప్పటినుంచో ఉంది. కానీ ఈసారి ఆరోపణలు ఏకంగా పోలీసుల నుంచి రావడంతో సంచలనంగా మారింది.
అయితే ఇన్ని ఆరోపణలు వచ్చినా.. సోషల్ మీడియాలో రవికి మద్దతు తెలుపుతున్న వారు కూడా ఉన్నారు. “పెద్ద స్థాయిలో నేరాలు చేసిన వాళ్లు బయట తిరుగుతున్నారు. ఎందుకు ఒక్క రవినే టార్గెట్ చేస్తున్నారు. “బెట్టింగ్ యాప్స్, స్కామ్ యాప్స్ డేటా లీక్‌లు పెద్దవి… వాటిపై ఎలాంటి చర్యలు లేవు కానీ రవినే ఎందుకు అరెస్ట్ చేశారని అంటున్నారు. రవి చేసిన నష్టాన్ని క్షమించే అవకాశం లేకపోయినా, ఇండస్ట్రీ పెద్దలు కోపంతో ఉన్నా.. ప్రేక్షకుల్లో మాత్రం రెండు వర్గాల అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

