టాలీవుడ్ స్టార్ హీరోల లుక్స్.. ఎలా మారిపోయారో చూడండి..!

టాలీవుడ్ స్టార్ హీరోల లుక్స్.. ఎలా మారిపోయారో చూడండి..!
Tollywood: తెలుగు హీరోలు తొలి సినిమా నుంచి పోల్చితే ఇప్పుడు ఎంతో మారిపోయారు.

తెలుగు సినీపరిశ్రమలో హీరోలకు ఉన్న అభిమానులు ఏ ఇండ్రస్ట్రీలో ఉండరేమో.. ఈతరం హీరోల్లో టాప్ నటుల గురించిన మాట్లాడాల్సి వస్తే.. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రాచ్ చరణ్, ప్రభాస్, బన్నీ ఇలా టాప్ హీరోల లిస్ట్ చాంతాడంత ఉంది. వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. ఫ్యాన్స్ చేసే హంగామా అంతఇంత కాదు. తొలి రోజు ఎంత కలెక్షన్స్ నుంచి సినిమా టాక్ వరకు.. ఇలా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పబ్లిసిటీ తెస్తారు. తెలుగు హీరోలు తొలి సినిమా నుంచి పోల్చితే ఇప్పుడు ఎంతో మారిపోయారు. వారిలో వచ్చిన మార్పులు ఆశ్చర్య కలిగించక మానదు. మన తెలుగు హీరోలు అప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు ఓ లుక్ వేయండి.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈవీవీ దర్శకత్వంలో 1996లో ఈ సినిమాలోని లుక్స్..ప్రస్తుత లుక్స్ చూస్తే చాలా ఛేంజ్ కనిపిస్తుంది.


కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1999లో రాజకుమారుడు పూర్తి స్థాయి హీరోగా నటించాడు. తాజాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన లుక్స్ కి అప్పటి తన ఫేస్ కు ఎంతో తేడా ఉంది. అప్పటి ప్రిన్స్ కాస్త సూపర్ స్టార్ గా మారాడు.



2001లో వెండి తెరకు పరిచయం అయ్యాడు జూ. ఎన్టీఆర్. తాత స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా..నందమూరి హరికృష్ణ తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రతాప్ దర్శకత్వంలో నిన్ను చూడాలని సినిమా చేశాడు.అప్పట్లో తన ఫిజిక్ పట్ల విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత యమదొంగ సినిమాతో సన్నగా మారాడు ఈ యంగ్ టైగర్.


2002లో సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్. జయంత్ సి పర్జానీ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమా చేశాడు. అప్పుడు బక్క పలుచగా ఉన్న ప్రభాస్. రాధేశ్యామ్ సినిమాకు వచ్చే సరికి ఊహించని రీతిలో మారిపోయాడు.


మెగాస్టార్ నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత అనే సినిమా చేశాడు. అప్పట్లో సన్నగా ఉన్న రామ్ చరణ్, ప్రస్తుతం చాలా హ్యాండ్సమ్ గా మారిపోయాడు.



2003లో రాఘవేంద్రరావు గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో అమాయకంగా కనిపించాడు. నెమ్మదిగా లుక్ మార్చుకుంటూ ప్రస్తుతం గ్లామరస్ హీరోగా మారిపోయాడు.




Tags

Read MoreRead Less
Next Story