Crime : జూబ్లీహిల్స్‌లో విషాదం.. సినీ నటి కాబోయే భర్త ఆత్మహత్య

Crime : జూబ్లీహిల్స్‌లో విషాదం.. సినీ నటి కాబోయే భర్త ఆత్మహత్య
X

జూబ్లీహిల్స్‌లోని ప్రశాంత్ నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సినీ నటి సోహాని కుమారి కాబోయే భర్త అయిన సవాయి సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఫ్లాట్‌లో ఆయన ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. రాజస్థాన్‌కు చెందిన సోహాని కుమారికి, సవాయి సింగ్‌కు కొన్ని రోజుల క్రితమే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. దీంతో ఇరువురూ జూబ్లీహిల్స్‌లోని ప్రశాంత్ నగర్‌లోని ఒక ఫ్లాట్‌లో కలిసి సహజీవనం చేస్తున్నారు.

సెల్ఫీ వీడియోలో ఆవేదన: ఈ క్రమంలో ఏంజరిగిందో తెలియదు కానీ సవాయి సింగ్ ఇవాళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాను ఆత్మహత్య చేసుకోబోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో "తాను తప్పు చేశానని, ఈ తప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నానని" సవాయి సింగ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సవాయి సింగ్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏంటి..? సెల్ఫీ వీడియోలోని వివరాలు ఏంటి అనే అంశాలపై వారు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా సవాయి సింగ్‌కు కాబోయే భార్య అయిన సోహాని కుమారి టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిగా కొనసాగుతున్నారు.

Tags

Next Story