Keeravani Father : టాలీవుడ్ లో విషాదం.. కీరవాణి తండ్రి మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త (92) కన్నుమూసారు. సంగీత దర్శకుడు కీరవాణి కి ఈయన సొంత తండ్రి. గత కొంతకాలంగా వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసం లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కీరవాణి తండ్రి గానే కాకుండా చిత్ర పరిశ్రమలో రచయిత గా తనదైన ముద్ర వేశారు శివశక్తి దత్త. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు గేయ రచయిత గా పనిచేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్,చత్రపతి, సై ,రాజన్న ,హనుమాన్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు ఈయన పాటలు రాశారు. అంతేకాకుండా పలు సినిమాలకు స్క్రీన్ రైటర్ గా కూడా ఆయన సేవలు అందించారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఈయన స్వయానా పెదనాన్న అవుతారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్త లు సొంత అన్నదమ్ములు..దీంతో ఇటు రాజమౌళి , అటు కీరవాణి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖులు కీరవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శివశక్తి దత్త మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com