Trisha : 45 రోజులు వర్షంలోనే త్రిష

చెన్నై బ్యూటీ త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ అని లేకుండా అన్ని భాషల్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది త్రిష. రీసెంట్ గా ఆమె ఒక తమిళ అవార్డుల వేడుకలో పాల్గొంది. ఈ ఈవెంట్ లో యాంకర్ త్రిష అమ్మ ఉమా కృష్ణన్ ను అడుగుతూ "త్రిష తన కెరీర్‌లో ఏ సినిమాకు అత్యంత కష్టపడ్డారు అని అడుగుతుంది. దీనికి ఉమ కృష్ణన్ మాట్లాడుతూ "త్రిష కెరీర్‌లో చాలా కష్టపడిన చిత్రం వర్షం. దాదాపు 45 రోజులు వర్షంలోనే ఉంది. ఒకానొక సమయంలో సినిమా మానేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ, సినిమా విడుదలయ్యాక మా కష్టం అంతా మర్చిపోయం" అని చెప్పగానే త్రిష కూడా వర్షం సినిమాకి నేను చాలా కష్టపడ్డాను అంటూ చెప్పుకోచ్చింది. ప్రస్తుతం త్రిష చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com