Trisha Account Hacked : త్రిష ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

వర్షం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతంగా దూసుకు పోతున్న తార త్రిష. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. కానీ సడెన్గా ఏమైందో ఏమోకానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 7 సినిమాలకు పైనే ఉన్నాయి. నిత్యం సోషల్ మీడియా లోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తన అందంతో అదరహో అనిపిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఎక్కువగా సినిమా విషయాలే కనిపించే త్రిష ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీ గురించి చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే వీటిని గమనించిన త్రిష వెంటనే అలర్ట్ అయ్యింది. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని గ్ర హించింది. వెంటనే ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. 'నా ట్విట్టర్ హ్యాక్ అయింది. ఇప్పటి వరకు ఆ పోస్టులు పెట్టింది నేను కాదు. కాబట్టి నా అకౌంట్ మళ్లీ సరిదిద్దే వరకు నా నుంచి ఎలాంటి పోస్ట లు రావు.. ధన్యవాదాలు' అని తన ఫాలోవర్స్ కు తెలియజేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com