Allu Arjun Movie : అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు?

Allu Arjun Movie : అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్ని సరసన ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు ఖరారైందని, మరో హీరోయిన్‌గా దిశా పటానీని తీసుకుంటారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ దాదాపు రూ.800 కోట్లతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. పుష్ప-2 బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత అల్లు అర్జున్‌ మరో సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌ హాలీవుడ్‌ స్టూడియోలు సైతం ఈ ప్రాజెక్టులో పని చేయనున్నారు. అలాగే, బాలీవుడ్‌ బడా స్టార్ విలన్‌ పాత్ర పోషిస్తారని తెలుస్తున్నది. అతను ఎవరో ఇంకా తెలియరాలేదు. జాన్వీ కపూర్‌ కపూర్‌ ‘దేవర’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీలోని హీరోయిన్‌గా నటిస్తున్నది.

Tags

Next Story