Pushpa-2 Results : బన్నీ అరెస్ట్‌తో ‘పుష్ప-2’కి ఊహించని రిజల్ట్స్

Pushpa-2 Results : బన్నీ అరెస్ట్‌తో ‘పుష్ప-2’కి ఊహించని రిజల్ట్స్
X

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టవడంతో దేశం మొత్తం ‘పుష్ప-2’ గురించి మాట్లాడుకుంటోంది. దీంతో సినిమాకు ఊహించని విధంగా కలెక్షన్లు పెరిగినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా నార్త్‌లో అరెస్ట్ తర్వాతే సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయని, ప్రపంచవ్యాప్తంగా 74శాతం మేర పెరిగినట్లు వెల్లడించాయి. కాగా ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.1409 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.

మరోవైపు అల్లు అర్జున్‌కు హైకోర్టు జారీ చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు పేర్కొంది. సంధ్య థియేటర్‌కు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని నిన్న ఓ రిపోర్టు బయటకు వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు హైకోర్టులో వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బెయిల్ రద్దయితే బన్నీ మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉంది.

Tags

Next Story