Marco Movie : 100 కోట్ల క్లబ్ లో ఉన్నిముకుందన్ మార్కో

ఉన్నిముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఉన్ని ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోను అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. గత ఏడాది డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓవర్ వయలెన్స్, తీవ్రమైన రక్తపాతం వంటి విమర్శ లు వచ్చినప్పటికీ సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టిం ది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి మరి చూస్తున్నారు. జనతా గ్యారేజ్, భాగమతి వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలు గులోనూ మంచి పేరున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని ముకుందన్. కానీ కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొని విమర్శల పాలయ్యా డు. కానీ ఇది తన కెరీర్ ను ఆపలేకపోయింది. ఆ తర్వాత బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. మె ప్పాడియన్, మాలికాపురంతో ఉన్నిముకుందన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ నుండి ఒక్కొక్కరుగా పాన్ ఇండియన్ హీరోలుగా మారుతున్న టైంలో ఈ జాబితాలోకి రీసెంట్లీ ఎంటరయ్యాడు ఉన్ని ముకుందన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com