Upasana : కియరా అద్వాణీకి ఇష్టమైన గిప్ట్ పంపిన ఉపాసన

Upasana :  కియరా అద్వాణీకి ఇష్టమైన గిప్ట్ పంపిన ఉపాసన
X

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది కియరా అద్వాణీ. ఆమె బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట తాము తొలి బిడ్డను ఆశిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. కియరా బేబి బంప్ ఫోటోలు ఇంటర్నెట్ లో లీకయ్యాయి కూడా. గర్భిణీ స్త్రీలు పులుపును ఇష్టపడుతారని చెబుతారు. ప్రస్తుతం కియారా గర్భిణి కూడా అదే రుచిని కోరుకుంటుంది కదా. అందుకే ఆమెకు నోరూరించే ఊరగాయ పచ్చడి అరుదైన కానుకగా పంపించింది ఉపాసన. పచ్చిమామిడితో చేసినది. లైవ్లీగా తినేందుకు, పులుపును ఆస్వాధించేందుకు గర్భిణి కియరా కోసం పంపింది. ఆ గిఫ్ట్ అందుకోగానే కియరా ఉబ్బితబ్బిబ్బయిందట. తనకు కానుక పంపిన చరణ్ ఉపాసన జంటకు ధన్యవాదాలు చెప్పిందామె. థాంక్యూ ప్రియతమా...! అని ఆనందం వ్యక్తం చేసింది. ఉపాసన తన అత్త సురేఖతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ లో తయారు చేసిన ఊరగాయ అది. కియరా అద్వాణీ రామ్ చరణ్ జంట రెండు సినిమాల్లో కలిసి నటించింది.

Tags

Next Story