UI Teaser Released : యూఐ టీజర్.. మీ ధిక్కారం కంటే..నా అధికారానికే పవర్

కన్నడ నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యూఐ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు తీసే ఉపేంద్ర యూఐ సినిమాలో ఎలాంటి కొత్తదనాన్ని ఆవిష్కరి స్తాడనే చర్చ జరుగుతోంది. ఇవాళ 'యూఐ' చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. వార్నర్ పేరుతో రిలీజైన ఈ టీజర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచంలో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్, కోవిడ్ 19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం, ప్రపంచ యుద్ధాలు వాటి పర్యవసానాలు ఈ సినిమాలో చూపించనున్నారు. టీజర్ లో ఈ సినిమా కథ 2040లో మొదలవుతుందని పేర్కొన్నారు. మొత్తానికి 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే తెలు స్తుంది. విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్, సలార్ సినిమాలను మరిపిస్తోంది. ఇక పెద్ద కారులో ఉపేంద్ర ఎంట్రీ ఇవ్వడం, చాలా మంది అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆ వెంటనే గన్ తీసుకుని కాల్పులు జరుపుతూ 'మీధిక్కారం కంటే నా అధికారానికి పవర్ ఎక్కువ' అని చెప్పడం హైలెట్. ఈ నెల 20న థియెట్రికల్ గా రిలీజ్ కాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com