US Warning : క్లాసులు ఎగ్గొడితే వీసా క్యాన్సిల్.. అమెరికా వార్నింగ్

X
By - Manikanta |28 May 2025 3:45 PM IST
అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులు, అక్రమ వలసదారుల పట్ల ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువుకోవడానికి యూఎస్కు వెళ్లి విద్యాసంస్థల పర్మిషన్ లేకుండా క్లాసులు ఎగ్గొడితే వీసాలు క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఇండియాలోని అమెరికా ఎంబసీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘డ్రాపౌట్ అయినా, క్లాస్లు ఎగ్గొట్టినా.. విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపో యినా.. మీ స్టూడెంట్ వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హతను కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి' అని యూఎస్ ఎంబసీ వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com