క్రేజీ క్లైమాక్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి

క్రేజీ క్లైమాక్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి
X

సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రా 'ఉస్తాద్ భగత్ సిం గ్' ఒకటి. 'గబ్బర్ సింగ్' తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి హైప్రయేట్ అయ్యింది. ఇందులో పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, స్పెషల్ వీడియోలు చిత్రంపై ఆసక్తిని మరింత రెట్టింపు చేశాయి. అయితే తాజాగా మేకర్స్ ఫైనల్ గా ఓ గుడ్ న్యూస్ చెప్పే సారు. ఈ మూవీ షూటింగ్ ఒక క్రేజీ క్లైమాక్స్ తో కంప్లీట్ అయినట్లు తెలిపారు. ‘ఎన్నో ఎమోషన్స్ ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ పూర్తయింది. నబకాంత మాస్టర్ పర్యవే క్షణలో యాక్షన్ సీన్స్ షూటింగ్ జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎంగా క్యాబినెట్ సమావేశాలు, బాధ్యతలను నిర్వర్తిస్తూ నే.. మరోవైపు 'హరి హర వీరమల్లు' ప్రచారంలో పవన్ కల్యాణ్ భాగమయ్యారు. అదే జోష్ తో 'ఉస్తాద్ భగత్సిం గ్' షూటింగ్ కూడా పాల్గొన్నారు. ఇది ఆయన అంకిత భావానికి, కష్టపడి పనిచేసే స్వభావానికి నిదర్శనం' అని మూవీ టీం పేర్కొంది. ఈ విషయాన్ని తెలుపుతూ సెట్లో ఉన్న ఓ ఫొటోను పంచుకుంది. ఇందులో మెరూన్ షర్ట్ వేసుకొని కళ్లద్దాలు పెట్టుకొని పవన్ మంచి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అం దిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. త్వరలోనే దీని విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Tags

Next Story