Ustad Bhagat Singh : సెట్స్ పైకి ఉస్తాద్.. శ్రీలీల పెద్ద మొత్తంలో డేట్లు!

పవన్ కల్యాణ్, శ్రీలీల జంటగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడానికి ముందు పెట్టిన మూడు చిత్రాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. ఆయన మళ్లీ అందుబాటులోకి వచ్చాక ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. హరిహర వీరమల్లును పూర్తి చేసిన ఆయన తర్వాత ‘ఓజీ'ని టేకప్ చేశారు. ప్రస్తుతం ఆ సినిమా షూట్ వేగంగా సాగుతోంది. 'ఉస్తాద్..' షూట్ ఇప్పట్లో ఉండదని అనుకున్నారు కానీ.. జూన్లో తిరిగి సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. చకచకా షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవన్ డేట్లు ఇవ్వడమే మహా భాగ్యం కాబట్టి మిగతా ఆర్టిస్టులవి బల్క్ డేట్స్ తీసుకునే పనిలో పడింది చిత్ర బృందం. తన కెరీర్లో ఇది బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటి కావడంతో శ్రీలీల 'ఉస్తాద్..' కోసం పెద్ద మొత్తంలో డేట్లు ఇచ్చేసిందట. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో శ్రీలీలకు వచ్చిన పెద్ద అవకాశం ఇది. ఎట్టకేలకు జూన్లో సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం అవుతుండడంతో కోరినన్ని డేట్లు ఇచ్చేసిందట శ్రీలీల. మిగతా ముఖ్య ఆర్టిస్టులందరూ కూడా సమయానికి అందుబాటులోకి వచ్చేయనున్నారు. పవన్ పరిమిత సంఖ్యలోనే డేట్లు ఇచ్చినా శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి హరీష్ శంకర్ అండ్ టీం ఏర్పాట్లు చేసుకుంటోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com