Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఆశలన్నీ జాక్ పైనే

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన వైష్ణవి చైతన్య సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటింది. ఇంతకుముందు సినిమాల్లో చిన్నా చితకాపాత్రలు చేసిన ఈ అమ్మడు బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఫస్టమూవీతో ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం మిగతా వారికి ఎంకరేజింగ్ గా ఉంటుందని అనిపించింది. బేబీ హిట్ తో ఐదారు మూవీలు ఛాన్స్ లు వస్తాయని ఊహించగా ఆ రేంజ్ రాలేదు. మరోపక్క చేసిన ‘లవ్ మీ' చిత్రం కూడా బాక్సాఫీసు ముందు బోల్తాపడింది. ఈ ఎఫెక్ట్ ఆమె కెరీర్ మీద పడింది. ఐతే ప్రస్తుతం ఈ అమ్మడు సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమా చేస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తోనే మూవీ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు. అయితే ఈచిత్రం సక్సెస్ అయితేనే ఈ ముద్దుగుమ్మకు మరిన్ని ఛాన్స్ లు వస్తాయి. ఒకవేళ అది తేడా కొడితే మాత్రం కెరీర్ రిస్క్ లో పడినట్టే అవుతుంది. ఐతే ఈ వయ్యారి భామ మాత్రం జాక్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది. మరి జాక్ తో బేబీ కోరుకుంటున్న హిట్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com