Vakeel Sab : వకీల్ సాబ్.. టాలీవుడ్ ట్రైలర్ రికార్డ్.. ఒక్కరోజులో 1 మిలియన్ వ్యూస్

Vakeel Sab

Vakeel Sab

Vakeel Sab : వకీస్ సాబ్ అదరగొట్టేశాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోలకన్నా పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో వకీల్ సాబ్ తో..


Vakeel Sab : వకీస్ సాబ్ అదరగొట్టేశాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోలకన్నా పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో వకీల్ సాబ్ తో మరోసారి స్పష్టంగా తేలిపోయింది. లేకపోతే.. సోమవారం రిలీజైన ట్రైలర్.. టాలీవుడ్ ట్రైలర్ చరిత్రలోనే తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. పాత రికార్డులను బ్రేక్ చేస్తూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరే సినిమాకు, మరే హీరోకు సాధ్యం కాని కొత్త రికార్డులను నెలకొల్పింది.

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ హీరోగా రెడీ అవుతున్న వకీల్ సాబ్ ధాటికి పాతి సినిమాల రికార్డులు నిలబడలేకపోతున్నాయి. జస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 22.44 మిలియన్ వ్యూస్ ని సాధించింది. ఇవన్నీ రియల్ టైమ్ వ్యూస్. అంటే టాలీవుడ్ లో ఒక్క రోజులోనే అత్యంత ఎక్కువమంది చూసిన ట్రైలర్ ఇదే. దీనికి సంబంధించిన పోస్టర్ ని చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది.

వకీల్ సాబ్ సినిమా.. బాలీవుడ్ లో హిట్ కొట్టిన పింకీ చిత్రానికి రీమేక్. ఇందులో పవన్ తో పాటు శ్రుతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్ యాక్ట్ చేశారు. భారీ తారాగణమే ఉండడంతో సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 9న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. వకీల్ సాబ్ గా పవన్ యాక్టింగ్ ను ట్రైలర్స్ చూసిన అభిమానులు.. ఇప్పటికే మంచి క్రేజ్ తో ఉన్నారు. పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

హిందీలో వచ్చిన పింక్ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీశారు. కానీ మన టాలీవుడ్ కి వచ్చేసరికి.. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చేశారు. మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమా రెడీ అవుతోంది.

Tags

Next Story