తమిళ పవర్‌ స్టార్‌తో వనిత నాలుగో పెళ్లి.. షాక్ లో ఫ్యాన్స్..!

తమిళ పవర్‌ స్టార్‌తో వనిత నాలుగో పెళ్లి.. షాక్ లో ఫ్యాన్స్..!
వనిత విజయ్‌కుమార్‌.. సినిమా విషయాల్లో కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈమె.

వనిత విజయ్‌కుమార్‌.. సినిమా విషయాల్లో కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈమె. ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ.. నాలుగో పెళ్లి కూడా చేసుకుంటుందంటూ ఆ మధ్య ఓ జోతిష్కుడు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆమె దివంగత నేత జయలలిత లాగా కూడా రాజకీయాల్లో కూడా రాణిస్తుందని పేర్కొన్నాడు. ఇదిలావుండగా తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోను షేర్‌ చేసి అభిమానులకి షాక్ ఇచ్చింది వనిత.

తమిళ పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. దీనితో ఆమె నాలుగో పెళ్లి చేసుకుందా? అని అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇంకొందరు అయితే ఏకంగా అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఇది నిజంగా పెళ్లికి సంబంధించిన ఫోటో కాదు. తాజాగా ఆమె నటిస్తున్న ఓ సినిమాలోని ఓ స్టిల్.. ఆమె ప్రస్తుతం 'వాసువిన్ 4 కార్పినిగల్' తో సహా పలు సినిమాల్లో నటిస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కాగా వనిత విజయ్ కుమార్.. నటీనటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె.. 1995లో 'చంద్రలేఖ' అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో విజయ్ కి జోడిగా నటించింది. ఇక తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రంలో కీ రోల్ పోషించింది. అటు వనిత విజయ్‌కుమార్‌.. 2000లో నటుడు ఆకాష్ ని పెళ్లి చేసుకొని 2007లో అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్ ని పెళ్లి చేసుకుంది. 2012లో అతని నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం పీటర్ పాల్ అనే వ్యక్తిని అక్టోబర్ 2020లో వివాహం చేసుకొని పరస్పర అంగీకారంతో అతనితో విడాకులు తీసుకుంది.


Tags

Read MoreRead Less
Next Story