Mega Couple : వెకేషన్ లో వరుణ్, లావణ్య ఎంజాయ్.. ఫోటోలు వైరల్

Mega Couple : వెకేషన్ లో వరుణ్, లావణ్య ఎంజాయ్.. ఫోటోలు వైరల్
X

మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె భర్త వరుణ్ తేజ్ గతంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అప్పటినుంచి ఇద్దరూ కలిసి మాల్దీవులకు వెకేషన్ వెళ్లారు. సినిమా సెట్స్, నగర లైట్స్ కి దూరంగా అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కాగా.. ఇటీవల లావణ్య 'బేబీ బంప్ తో కనిపించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా వరుణ్ ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ షేర్ చేశాడు. బీచ్లో వాకింగ్, సూర్యాస్తమయం టైంలో ఈ స్టార్ జంట అందమైన తెల్లటి దుస్తులను ధరించి సెల్ఫీ తీసుకుంది. లావణ్య సరదాగా వరుణ్ తలపై చేయి వేసుకుని కనిపించింది. ఈ ఫొటోలకు 'సన్ సెటేట్ ఆఫ్మెండ్' అంటూ వరుణ్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ పిక్స్ చూసిన మెగా ఫ్యాన్స్ లవ్ సింబల్ జోడించి సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కలిసి రెండు మూవీలు చేసిన వరుణ్, లావణ్య.. దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. పెద్దల్ని ఒప్పించి 2023లో పెండ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేసిన లావణ్య.. అంతకు ముందే ఒప్పుకొన్న ఒకటి రెండు చిత్రాలు, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. మరోవైపు వరుణ్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో కలిసి ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. ఇదివరకే కొంతమేర షూటింగ్ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

Tags

Next Story