Tollywood : వెంకీ-అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' కొత్త హిస్టరీ

Tollywood : వెంకీ-అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కొత్త హిస్టరీ
X

కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సినిమాగా అలరించబోతోంది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా. ఈ మూవీలో వెంకటేశ్ కథానాయకుడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయికలు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు పాట ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 వీడియోల్లో చోటు సంపాదించింది. సింగిల్ మీను.. అనే పాటను గురువారం విడుదల చేశారు. భార్య పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్ తో తన ప్రేమకథను వెంకటేష్ వివరిస్తున్నట్టు ఈ పాట చిత్రీకరించారు. పోలీస్ అకాడమీలో ట్రైనర్ గా చేస్తున్నప్పుడు, అతను తన ట్రైనీ మీనాక్షితో ప్రేమలో పడతాడు. వారు వివిధ ప్రదేశాలను సందరిస్తారు. కలిసి కొన్ని మంచి క్షణాలను పంచుకుంటారు. వారి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, అతను ఆమెను ముద్దు పెట్టుకోకుండా తప్పించుకుంటాడు. తన మొదటి ముద్దు తన భార్యతో మాత్రమే అంటాడు. ఈ పాటను అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ప్రణవి ఆచార్యతో కలిసి భీమ్స్ అలపించారు. వెంకటేష్, మీనాక్షితో పాటు ఐశ్వర్య చిత్రీకరణలో పాలుపంచుకున్నారు. భాను మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ సమకూర్చారు. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Tags

Next Story