Tollywood : వెన్నెల కిషోర్ సినిమా టీజర్ రిలీజ్

Tollywood : వెన్నెల కిషోర్ సినిమా టీజర్ రిలీజ్
X

టాలీవుడ్ నటుడు వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న సినిమా 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' టీజర్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు చంటబ్బాయ్ తాలుకా అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో వెన్నెల కిశోర్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు. వచ్చేనెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా వెన్నెల కిశోర్ యాక్టింగ్ ఫర్మామెన్స్ తెగ ఆకట్టుకుంటోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్పై వెన్నపూస రమణా రెడ్డి నిర్మించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఒక పోలీసు అధికారి క్రిమినల్ కేసును ఛేదించడానికి డిటెక్టివ్ కు అప్పగించాలని అనుకుంటారు. కానీ క్రెడిట్ మాత్రం తాను తీసుకోవాలనుకుంటారు. ఆ పనిని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిషోర్)కు అప్పగిస్తారు. అవుట్ లుక్ చూసి కాదు సార్.. అవుట్ పుట్ చేసి ఇవ్వండి.. ఛాన్స్ ఇస్తే కదా.. చిరు మెగాస్టార్ అయ్యారు అంటూ తన డైలాగ్ ఇంట్రెస్ట్ పెంచాడు వెన్నెల కిషోర్. ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసేలా టీజర్ ఉంది

Tags

Next Story