Vettaiyan : రజనీకాంత్ భార్యగా మల్లూ లేడీ సూపర్ స్టార్

సూపర్‌స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ ‘వేట్టైయన్’ . జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, దుషార విజయన్, రితికా సింగ్ మరియు అభిరామి ఈ సందేశాత్మక యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు.
ఇందులో రజనీకి భార్యగా నటిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ వెల్లడించారు. మంజు మాట్లాడుతూ ''వేట్టైయన్ రజనీకాంత్ సినిమా ఔట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా. జై భీమ్ లాంటి మంచి సినిమా తీసిన టీజే జ్ఞానవేల్ టచ్ కూడా ఇందులో ఉంటుంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా లాక్ కాలేదు. నా క్యారెక్టర్‌కి డబ్బింగ్ ఇంకా పూర్తి చేయలేదు'' అన్నారు.
‘వేట్టైయన్’ న్యాయవ్యవస్థ, పోలీస్ లాంటి వ్యవస్థాపక వ్యవస్థల్ని ప్రశ్నిస్తాడు. రానా దగ్గుబాటి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లుగా డ్రామా భాగం చాలా హైలైట్ గా ఉంటుంది. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగులో ఈ సినిమా ‘వేటగాడు’ గా విడుదలవుతుందనే వార్తలొస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com