OTT : ఓటీటీలోకి వేటయాన్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుమారు రూ. 420 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈమూవీ. అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ వంటి ఎందరో స్టార్ మూవీలో కీలక పాత్రలు చేశారు. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. అయితే తాజా అప్డేట్ ప్రకారం వెట్టయాన్ మూవీ ఎల్లుండి (నవంబర్ 8) నుంచి ఓటిటిలోకి వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన మూవీ టీమ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కానున్నట్టు తెలిపింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రానుంది. ఈసినిమా డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com