Vijay Deverakonda : ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda : ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ..
X

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ వంటి సెలబ్రిటీలను విచారించి.. కీలక విషయాలపై ఆరా తీసింది. తాజాగా రౌడీబాయ్ విజయ్‌ దేవరకొండఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్ చేసిన వ్యవహారంలో విజయ్‌ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల నుంచి తీసుకున్న రెమ్యునరేషన్, కమీషన్లపై కూపీ లాగుతున్నారు. ఈ నెల 11న విచారణకు రావాలని రానాకు, 13న విచారణకు రావాలని మంచు లక్ష్మీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో సిట్ కూడా విచారణ ముమ్మరం చేసింది.

Tags

Next Story