Kingdom Movie : విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వాయిదా

Kingdom Movie : విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వాయిదా
X

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ 'కింగ్ డమ్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిస్. ఇందులో వీడీ గూఢచారిగా కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం రోజుకో అప్డేట్ తో మరింత హైప్ ని సెట్ చేసుకుంటుండగా.. తాజాగా ఈచిత్రం రిలీజ్ వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్లు ఈనెల 30కి బదులుగా జులై 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ప్రమోషన్స్ చేయడం సాధ్యంకాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రా నికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Tags

Next Story