Maharaja 2 : విజయ్ సేతుపతి మహారాజా -2 వస్తోంది!

విజయ్ సేతుపతి నటించగా, గత సంవత్సరం వచ్చిన 'మహారాజా' చిత్రం మంచి విజయం సాధించింది. కోలీవుడ్ సరైన సమయంలో వచ్చిన హిట్ గా పలువురు తెలిపారు. విజయ్ సేతుపతికి ఇది 50వ చిత్రంకావడం విశేషం. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్దాస్, అభిరామి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంతో నిథిలన్ స్వామినాథన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కమర్షియల్ లెక్కల ప్రకారం మహారాజా దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా నిర్మాణ వ్యయం మాత్రం కేవలం రూ.20 కోట్లు మాత్రమే. “మహారాజా” సినిమాకు సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నట్టు కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తాజాగా విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబినేషన్ సినిమా కుదిరిందని, దీనికి మహారాజా 2 టైటిల్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండనున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి అత్యంత బిజీ నటుడు. తెలుగులో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com