Vijay–Trisha : త్రిషతో విజయ్ బంధం.. ముంచేస్తుందా..?

తమిళనాడు రాజకీయాల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారిన విజయ్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోకి వస్తున్నారు. రీసెంట్ గా ఒక తమిళ బీజేపీ చీఫ్ నాగేంద్రన్ విజయ్ అండ్ త్రిష మీద సంచలన ఆరోపణలు చేశారు. త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు వచ్చి రాజకీయాలు చేస్తేనే మంచిది అంటూ చెప్పారు. ఆయన వ్యాఖ్యల మీద త్రిష చాలా సీరియస్ అయ్యారు. తనను రాజకీయాల్లోకి లాగుతున్నారు అంటూ మండిపడ్డారు. అటు విజయ్ కూడా వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగుతున్నారు అంటూ మండిపడ్డారు. నాగేంద్రన్ కు సరైన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన అలా స్టేట్మెంట్ ఇచ్చిన రెండు రోజులకే ఓ నిర్మాత కొడుకు పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ కనిపించాడు. ఇలా కనిపిస్తే ఎవరికీ పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇద్దరూ కలిసి ఒకే కారులో వచ్చారు. పైగా ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నారు. ఇద్దరూ కలిసి స్టేజి మీదకి ఎక్కి విషెస్ చెప్పారు. ఇద్దరూ ఇలా కలిసి మెలిసి కనిపంచడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కిపోయాయి.
అయితే విజయ్ కావాలనే ఇలా త్రిషతో కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇదే అంశం మీద ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని విజయ్ భావించి ఉండొచ్చు. అందుకే త్రిషతో తన బంధాన్ని ఇలా బయటపెట్టారేమో అంటూ కొన్ని రకాల సోషల్ మీడియా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. విజయ్ కు ఇంకా విడాకులు రాలేదు. ఆయనకు తన భార్యతో ఉన్న సంబంధం గురించి ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. విడిపోతారా కలిసి ఉంటారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇంతలోనే ఇలా కనిపించడం ఏంటని అంతా గగ్గోలు పెడుతున్నారు. పోనీ త్రిషతో ఉన్న బంధం గురించి అయినా సరే క్లారిటీగా చెప్పట్లేదు విజయ్. తనను అభిమానించే వారికి ఈ విషయం మీద ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత విజయ్ మీద ఉంది. కానీ అవేవీ చేయకుండా చెట్టాపట్టాలేసుకుని తిరిగితే మాత్రం అది విజయ్ రాజకీయ భవిష్యత్తుకు కచ్చితంగా ప్రమాదమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
