Thangalaan Sequel : తంగలాన్ కు సీక్వెల్ ఉంటుంది.. విక్రమ్ ప్రకటన

Thangalaan Sequel : తంగలాన్ కు సీక్వెల్ ఉంటుంది.. విక్రమ్ ప్రకటన
X

విక్రమ్ నటించిన పీరియాడిక్ సినిమా తంగలాన్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తంగలాన్ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడంతో పాటు సక్సెస్ టాక్ రావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు.

"తంగలాన్ విడుదలకు ముందే నేను చెప్పాను. ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా ఆదరించే సినిమా అవుతుందని. ఇది మట్టి మనుషుల కథ. ఇలాంటి కథను తెలుగు ప్రేక్షకులు తప్పుకుండా ఆదరిస్తారు. నేను చెప్పినట్టు గానే తెలుగు రాష్ట్రాల్లో తంగలాన్ బాగా ఆడుతోంది. పా. రంజిత్ కు నాపై ఉన్న నమ్మకం వల్లే తంగలాన్ చేయగలిగాను. ఈ సినిమాకు పార్ట్ 2 చేయాలని నేను పా.రంజిత్, జ్ఞానలేవ్ అనుకున్నాం. తప్పకుండా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది." అన్నారు హీరో విక్రమ్.

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ఎంతో పోటీలో విడుదలైన మా సినిమాకు మంచి సక్సెస్ అందిం చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నాను. దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ తంగలాన్ ఒక చర్చ మొదలయ్యేలా చేసింది. విక్రమ్ గొప్ప నటుడు. దర్శకుడు కోరుకున్నట్లు నటిస్తాడు. మాళవిక ఎనర్జీ ఆరతి పాత్రను మరింత అందంగా తయారుచేసింది అన్నారు. నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ తంగలాను మేము ఆశించిన దానికంటే ఎక్కువ రెవెన్యూ వస్తోంది అని అన్నారు.

Tags

Next Story