Vikramarkudu Re-Release : జులై 27న రవితేజ విక్రమార్కుడు రీరిలీజ్

Vikramarkudu Re-Release : జులై 27న రవితేజ విక్రమార్కుడు రీరిలీజ్
X

మాస్ మహారాజా రవితేజ, డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమార్కుడు’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం వచ్చింది. ఈ నెల 27న ‘విక్రమార్కుడు’ను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ‘4K’ ప్రింట్‌కు సంబంధించిన పనులు కూడా స్టార్ట్‌ అయ్యాయని సమాచారం. 2006లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పేసిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా బ్రహ్మానందం, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు అలాగే ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళను సాధించింది. విక్రమ్‌సింగ్‌ రాథోడ్‌, అత్తిలి సత్తిబాబు రెండు విభిన్న క్యారెక్టర్‌లలో రవితేజ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Tags

Next Story