Actor Vishal : ఇళయరాజాపై విశాల్ ఫైర్

Actor Vishal : ఇళయరాజాపై విశాల్ ఫైర్
X

సంగీత దర్శకుడు ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ డైరెక్టర్ మిస్కన్ పై హీరో, నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భావవ్య క్తీకరణ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాకపోతే స్టేజీపై మాట్లాడేటప్పుడు ఓ పద్ధతి ఉంటుందని అన్నారు. ఇళయరాజా అంటే చాలా మంది ఆరాధాదిస్తారని, అలాంటి వ్యక్తిని అగౌరవపర్చేలా వ్యాఖ్యలు చేయడాన్ని తాను క్షమించనని అన్నారు. ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్తే అంగీకరిస్తారా..? అని విశాల్ ప్రశ్నించారు. ఈవిధంగా వ్యవహరించడం మిస్కిన్కు అల వాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. ఎంతోమంది సంగీతప్రియులు ఆరాధించే ఇళయరాజా గురించి అలాంటి కామెంట్స్ చేయడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. విశాల్, డైరెక్టర్ మిస్కిన్ కాంబోలో 2017లో తుప్పరివాలన్‌ సినిమా వచ్చింది. . యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించింది. అయితే, అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ చిత్రంలో వినయ్ రాయ్, ప్రసన్న కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు.

Tags

Next Story