Actor Vishal : థియేటర్ల బయట ఇచ్చే రివ్యూలపై విశాల్ ఫైర్

Actor Vishal : థియేటర్ల బయట ఇచ్చే రివ్యూలపై విశాల్ ఫైర్
X

ప్రముఖ నటుడు మరియు నిర్మాత విశాల్, సినిమా థియేటర్ల బయట ఇచ్చే రివ్యూలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన మొదటి రోజు లేదా మొదటి షో తర్వాత, థియేటర్ల ముందు ప్రేక్షకులు, యూట్యూబర్లు, కొందరు విమర్శకులు ఇచ్చే రివ్యూలు చాలా మంది ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయని అన్నారు. ఈ రివ్యూలు తరచుగా ట్రోలిం కు, సినిమాపై అనవసరమైన నెగటివిటీని సృష్టించడానికి దారితీస్తున్నాయని విశాల్ అభిప్రాయపడ్డారు. ఒక సినిమా ఫలితం మొదటి రోజు రివ్యూలపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని, ఇది సినిమా మేకర్లకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విశాల్ అన్నారు. కొన్నిసార్లు ఒక సినిమా నెమ్మదిగా పుంజుకుంటుంది, కానీ ఈ తక్షణ రివ్యూల వల్ల ఆ అవకాశమే లేకుండా పోతుందని తెలిపారు. ఒక సినిమా తీయడానికి నిర్మాతలు ఎన్నో కష్టాలు పడతారు, వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. అలాంటి సినిమాను థియేటర్ బయట కేవలం పది నిమిషాల రివ్యూతో నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని విశాల్ ప్రశ్నించారు.. ప్రేక్షకులు సొంతంగా సినిమాను చూసి నిర్ణయించుకోవాలని, ఇతరుల రివ్యూలను గుడ్డిగా నమ్మకూడదని ఆయన కోరారు.

Tags

Next Story