Vishal : విజయ్ సేతుపతితో విశాల్

Vishal : విజయ్ సేతుపతితో విశాల్
X

విజయ్ సేతుపతితో తాను కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ విశాల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని విశాల్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా అభి మానులతో పంచుకున్నాడు. 'నా ఫ్రెండ్ విజయ్ సేతుపతిని చాలాకాలం తర్వాత చెన్నై ఎయిర్ పోర్టులో కలిశా. అతడిని ఎప్పుడు కలిసినా ఆనందమే. కొన్ని నిమిషాలపాటే మేం మాట్లాడుకున్నా అదెంతో బాగుంది' అని పేర్కొన్నారు. విజయ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన విశాల్.. ఆ నటుడిని త్వ రలోనే మరోసారి కలవాలని ఆకాంక్షించారు. కాగా.. ఇటీవల తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలో నిర్వహించిన అందాల పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే.

Tags

Next Story