Vishwambhara : టీజర్ కు సమయం ఆసన్నమైంది !

Vishwambhara : టీజర్ కు సమయం ఆసన్నమైంది !
X

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) కెరీర్ లో 156వ చిత్రం ‘విశ్వంభర’. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి చిత్రాల తర్వాత చిరు నటిస్తు్న్న సోషియో ఫాంటసీ చిత్రం ఇదే అవడంతో దీనికి మంచి హైపు క్రియేట్ అయింది. విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి ( Mallidi Vasishta ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇంకా క్లైమాక్స్, మూడు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నాయి.

నిజానికి విశ్వంభర చిత్రం లాంచింగ్ టైమ్ లో రిలీజైన టైటిల్ టీజర్ తప్ప.. ఆ తర్వాత ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ మూవీలోని చిరంజీవి లుక్ అన్ అఫీషియల్ గా వివిధ సందర్భాల్లో రివీల్ అయిపోయింది. అయినప్పటికీ... మెగా ఫ్యాన్స్ విశ్వంభర చిత్రం నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ను ఆశిస్తున్నారు. దానికి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22, 2024న అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ వదలబోతున్నారని టాక్ . దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది.

ఆషికా రంగనాథ్, రమ్య పసుపలేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి కునాల్ కపూర్ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌కి సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Tags

Next Story