Tollywood : ఓజీ కంటే ముందే థియేటర్ లోకి విశ్వంభర!

చిరంజీవి, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించి ఒక పాట మినహా మిగతా పార్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపుదిద్దకుం టున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సోసియో ఫాంటసీ మూవీ విడుదల ఎప్పడన్న చర్చ జోరుగా సాగుతోంది. దసరా సీజన్ లో సెప్టెంబర్ 18న విడుదల చేయడానికి ని ర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. అంటే ఓజీ సినిమా కన్నా ముందే విశ్వంభర విడుదలవుతుంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీనిపై అధికా రిక ప్రకటన వెలువడుతుంది. థియేట్రికల్ ఒప్పందాలు అతి త్వరలో ముగిసే అవకాశం ఉంది. జియో హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కు లను చేసుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com