Ramayana : విజువల్ వండర్ .. రూ.1,600 కోట్లతో రామాయణ

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో రామాయణ ఒకటి. రణబీర్ కపూర్ రాముడిగా, సీతగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి, యష్ రావణుడి పాత్రలో నటిస్తుండగా.. సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నాడు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. డైరె క్టర్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని రూ.1,600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోం ది. ఫస్ట్ పార్ట్ రూ.900 కోట్లతో రానుందని.. రెండోది రూ.700 కోట్లని సమాచారం. దీనికోసం మేకర్స్ ఇప్ప టికే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారట. మొదటి భాగం కోసం ఎక్కువ సెట్స్ వేస్తారని అందుకే పార్ట్ 2 కంటే దాని బడ్జెట్ ఎక్కువని బాలీవుడ్ మడియాలో చక్కర్లు కొడుతు న్నాయి. సెకండా పార్ట్ కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయట. ఈ బడ్జెట్ నిజమైతే అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా 'రామాయణ' చరిత్ర సృష్టిస్తుంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయను న్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెగ్యులర్ గా జరుగుతోంది. రామాయణం మీద ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా.. ఇప్పటి జనరేషన్ ను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com