Vivek Agnihotri: పూటుగా తాగి నేనే దైవం అంటే జనం నవ్విపోతారు

Vivek Agnihotri: పూటుగా తాగి నేనే దైవం అంటే జనం నవ్విపోతారు
'ఆదిపురుష్' పై కశ్మీరీ డైరెక్టర్ విమర్శలు; ఇన్ డైరెక్ట్ గా ప్రభాస్ కు చురకలు

చిత్ర దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ నటులు ఉన్నప్పటికీ, రామాయణ ఇతిహాసానికి భిన్నంగా చిత్రీకరించినందు అనేక విమర్శల పాలైంది. అనుచిత వర్ణన, కొన్ని అభ్యంతరకరమైన డైలాగ్‌లు, సన్నివేశాలు, లో క్వాలిటీ VFX వంటివి థియేటర్‌ల వద్ద పరాజయం పాలయ్యేందుకు కారణాలుగా నిలిచాయి. దీంతో ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాతలు, ప్రముఖులు కూడా నిషేధం విధించాలని కోరారు. ఇప్పుడు, ఈ వివాదాస్పద చిత్రంపై 'ది కశ్మీర్ ఫైల్స్‌'తో పేరుగాంచిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలోని లోపాలను ఎత్తిచూపడం, మేకర్స్‌ని నిందించడమే కాకుండా,.. వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ పైనా విమర్శలు గుప్పించారు.

ఆదిపురుష్ పై వివేక్ అగ్నిహోత్రి

ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి పురాణాలు, మతానికి సంబంధించిన కథలపై సరైన నమ్మకం, విశ్వాసం, నమ్మకం లేకుంటే ఇలాంటి అపజయాలే ఎదురవుతాయని ఆరోపించారు. ఇది ప్రభాస్ 'ఆదిపురుష్‌'తో జరిగిందని అభిప్రాయపడ్డారు. "మహాభారతం లేదా రామాయణం వంటి సినిమాల కోసం స్టార్‌ హీరోలను ఎంచుకుంటే ఫలితం ఉండదు. మేకర్స్ ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలిగినా చివరికి ‘ఆదిపురుష్’ లాంటి ఫలితాన్నే చవిచూస్తారని తెలిపారు వివేక్. ఒక కథ ఐదు వేల సంవత్సరాలుగా కొనసాగుతుందంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. కాబట్టి ఎవరైనా అలాంటి కథల్లో దేవుడిగా నటించినంత మాత్రాన అది వాళ్లను దేవుళ్లుగా చేయదు. ప్రతి రోజూ రాత్రి పీకలదాకా తాగి తెల్లవారి నేనే దేవుణ్ని అంటే ఎవరూ నమ్మరు. ప్రజలు మూర్ఖులు కాదు" అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. కాగా ప్రభాస్‌ను ఉద్దేశించే వివేక్ అగ్నిహోత్రి ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వివేక్ అగ్నిహోత్రి సినిమాలు

వివేక్ అగ్నిహోత్రి సినిమా విషయాలకొస్తే ఆయన చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 'ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్' పేరుతో కొత్త వెబ్ సిరీస్‌తో వస్తున్నట్టు ఆయన ఇటీవలే ప్రకటించగా.., ఇది జమ్మూ, కశ్మీర్‌లోని 1990లో కశ్మీరీ పండిట్‌ల నిర్వాసితుల నిజ జీవితంలో ప్రాణాలు, బాధితులు, సాక్షుల కథను డాక్యుమెంట్ చేస్తుందని చెప్పారు. కొవిడ్-19 వ్యాక్సిన్‌తో రావడానికి శాస్త్రవేత్తలు చేసిన నిరంతర ప్రయత్నాల ఆధారంగా రూపొందించిన 'ది వ్యాక్సిన్ వార్' అనే చిత్రానికీ ఆయన చిత్రనిర్మాతగా పనిచేశారు.

భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదలైన 'ఆదిపురుష్'.. అత్యధిక థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో భారీగా కలెక్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం చతికిలపడింది.


Tags

Read MoreRead Less
Next Story