Sai Pallavi : నేషనల్ అవార్డు కోసం వెయిటింగ్

Sai Pallavi : నేషనల్ అవార్డు కోసం వెయిటింగ్
X

మలార్ ' నుంచి 'సత్య' వరకూ రోల్ ఏదైనా సరే తన యాక్టింగ్ మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ సాయిపల్లవి. డ్యాన్స్, గ్లామర్, క్యూట్ లుక్స్ తో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈభామ తన మనసులోని మాటలను బయటకు చెప్పింది. 'నేషనల్ అవార్డు అందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఎందుకంటే, నాకు 21 ఏండ్లు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర ఇచ్చింది. మ్యారేజీ చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. నా తొలి చిత్రం 'ప్రేమమ్' కోసం వర్క్ చేశా. ఇండస్త్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటా. జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్పది. దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి వస్త' అని సాయిపల్లవి తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ ‘తండేల్’బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

Tags

Next Story