Kiara Advani : తల్లిదండ్రులు కాబోతున్నం.. కియారా కపుల్స్ గుడ్ న్యూస్

నటి కియారా అద్వాణీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారట. ఈ విషయాన్ని ఇండికేట్ చేస్తూ.. బేబీ సాకసన్ను చేతుల్లో పట్టుకున్న ఫొటోను ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. "మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలో రానుంది" అని పేర్కొన్నారు. బేబీ ఎమోజీని జత చేశారు. దీనిపై పలువురు నెటి జన్లు స్పందిస్తూ స్టార్ కప్పుల్కు అభినందనలు తెలుపుతున్నారు. 2021లో విడుదలైన ‘షేర్షా' సినిమా కోసం తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు వీళ్లిద్దరు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. కుటుంబసభ్యుల సమక్షంలో 2023 ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా వీరిద్ద రూ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా రు. కియారా అద్వాణీ నటించిన 'గేమ్ చేంజర్' ఇటీవల విడుద లైన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com