Tollywood : సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాం : తండేల్ టీమ్
అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'తండేల్'. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కొంత కాలంగా ఈ సినిమా విడుదల గురించి న్యూస్ వైరల్ అవుతున్న నేపధ్యంలో దర్శకుడు చందు మొండేటి క్లారిటీ ఇచ్చాడు. "సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాం. తండేల్ షూటింగ్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా పదిరోజులలో మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ సంక్రాంతికి చరణ్ ఉన్నాడు కదా అని చిత్ర నిర్మాత అరవింద్ గారు ఆలోచిస్తే మాత్రం జనవరిలో రాము" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చందు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com