Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
X

పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హీ రోహీరోయిన్లుగా వచ్చిన సినిమా హరి హర వీర మల్లు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాంగ్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ తో దూసుకెళుతోంది. రెండేళ్ల తర్వాత పవన్ స్క్రీన్ మీద కనపడటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. పవన్ కూడా ప్రమోషన్స్ చేయడంతో ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతేకాదు, అడ్వాన్స్ సేల్స్ తోనే రూ. 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపె నింగ్స్ వచ్చాయని అంటున్నారు.

'హరి హర వీరమల్లు' మొదటి రోజు కలెక్షన్లు (అంచనా):

• ప్రీమియర్ షోల ద్వారా (జులై 23): ₹12.7 కోట్ల నెట్ కలెక్షన్లు.

• మొదటి రోజు (జులై 24) ఇండియాలో నెట్ కలెక్షన్లు: ₹31.50 కోట్లు.

• మొదటి రోజు (ప్రీమియర్స్ + డే 1) మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు: ₹44.20 కోట్లు.

• మొదటి రోజు (ప్రీమియర్స్ + డే 1) ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు: సుమారు ₹64.74 కోట్లు.

పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో 'వకీల్ సాబ్' (₹40.10 కోట్లు), 'భీమ్లా నాయక్' (₹37.15 కోట్లు), 'బ్రో' (₹30.5 కోట్లు) చిత్రాల ఓపెనింగ్ రికార్డులను 'హరి హర వీరమల్లు' అధిగమించింది. అయితే, రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' (₹51 కోట్లు) చిత్రం మొదటి రోజు కలెక్షన్లను ఇది అధిగమించలేకపోయింది.

సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, పవన్ కల్యాణ్ స్టార్‌డమ్ కారణంగా మొదటి రోజు భారీ వసూళ్లను సాధించింది. అయితే, రెండో రోజు కలెక్షన్లు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.

Tags

Next Story