Raja Saab : రాజా సాబ్ గ్లింప్స్ తో వచ్చిన క్లారిటీ ఎంత..?

Raja Saab : రాజా సాబ్ గ్లింప్స్ తో వచ్చిన క్లారిటీ ఎంత..?
X

బాహుబలి నుంచి ప్రభాస్ పంథా మారింది. ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. కానీ అతన్ని ఒకప్పటి డార్లింగ్, మిర్చి మూవీస్ లో లాగా మంచి లవబుల్ రోల్ లో చూడాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అలా రాధేశ్యామ్ లో కనిపించాడు కానీ సినిమా చాలామందికి నచ్చలేదు. దీంతో ఆ పని నేను చేస్తా అంటూ ముందుకు వచ్చాడు దర్శకుడు మారుతి. పైగా ఫస్ట్ టైమ్ ప్రభాస్ తో హారర్ మూవీ చేస్తాను అన్నాడు. మొదట చాలామంది నమ్మలేదు. కానీ అదే నిజమైంది. రాజా సాబ్ కు ముందు మారుతి చేసిన మంచి రోజులొచ్చాయి, పక్కా కమర్షియల్ సినిమాలు డిజాస్టర్. దీంతో ప్రభాస్ వెనక్కి తగ్గుతాడు అనుకున్నారు. బట్ డార్లింగ్ తగ్గలేదు. అందుకే రాజా సాబ్ గ్లింప్స్ వరకూ వచ్చింది మేటర్.

అయితే లేటెస్ట్ గా వచ్చిన గ్లింప్స్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే టార్గెట్. అంతకు మించి ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసినంత మెటీరియల్ ఏం కనిపించలేదు. కాకపోతే డార్లింగ్ లుక్ మారింది. అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు లవబుల్ గా కనిపించాడు. అయితే రొమాంటిక్ హారర్ కామెడీ అన్నారు కదా.. ఆ యాంగిల్ లో ఏదైనా ఓ నాలుగైదు సెకన్స్ పాటైనా ఓ హారర్ ఎలిమెంట్ ఉంటే ఇంకా బావుండేది అనే భావన కూడా చాలామందిలో ఉంది. ఏదేమైనా ఆయన పూలతో దిష్టి తీసుకోవడం.. బైక్ పై రావడం చూడగానే బావుంది అనిపించినా.. తర్వాత ఏముంది ఇందులో అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అయితే ఇదే మేటర్ మేకర్స్ కు సోషల్ మీడియాలో కొందరు అడిగారు. బట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే గ్లింప్స్ లో ఇది ఇవ్వడమే ఎక్కువ అన్న టైప్ లో అటు నుంచి రిప్లై వచ్చింది. మొత్తంగా ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేస్తోన్న హారర్ మూవీ 2025 ఏప్రిల్ 10న విడుదలవుతుంది.

Tags

Next Story