Bigg Boss : సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ బిగ్ బాస్..?

Bigg Boss : సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ బిగ్ బాస్..?
X

తెలుగు బిగ్ బాస్ సీజన్-9పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బిగ్ బాస్ లో ఎంటర్ టైన్ మెంట్ కంటే బూతు కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏ మాత్రం ఉపయోగం లేని విషయాలపై కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. వాళ్లు మాట్లాడే బూతులు, ఆ రచ్చ చూస్తుంటే.. ఎవరికైనా ఉపయోగం ఉందా అనే ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి. సమాజానికి ఈ షో వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ విమర్శలు పీక్స్ కు వెళ్లిపోయాయి. తాజాగా గజ్వేల్ కు చెందిన కొందరు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ ను మూసేయాలంటూ వాళ్లు ఆ ఫిర్యాదులో కోరారు.

బిగ్ బాస్ వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ వాళ్లు ప్రశ్నించారు. సంసారాలు నాశనం చేసేలా ఈ షో ఉందని.. ఇలాంటి వాటి వల్ల పిల్లలు చెడిపోతున్నారంటూ వాళ్లు మీడియా ముందు చెప్పారు. రేపో మాపో కోర్టులో కూడా పిటిషన్ వేస్తామంటున్నారు సామాజిక కార్యకర్తలు. బిగ్ బాస్ షో మీద ఎలాంటి రూల్స్ లేవు. కనీసం ఇలాంటి కంటెంట్ ను ఎంకరేజ్ చేయొద్దనే కండీషన్లు ఎందుకు లేవనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అశ్లీల ఫోజులు, అశ్లీల మాటలు మరీ ఎక్కువ అవుతున్నాయనే కామెంట్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వివాదాల్లో ఉన్న వారిని బిగ్ బాస్ లోకి తీసుకువచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు. మొన్న తెలుగులో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో ఎక్కువగా కాంట్రవర్సీ కంటెస్టెంట్లే ఉన్నారు. ఇప్పుడు వాళ్లు హౌస్ లో ఎంత గొడవలు చేస్తున్నారో, ఎలాంటి మాటలు మాట్లాడుతూ చిరాకు తెప్పించేలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం.

ఈ బిగ్ బాస్ ను టీనేజ్ యువత ఎక్కువగా చూస్తుంది. ఇందులో అనవసర విషయాలకు గొడవలు పడటం, రచ్చ చేయడం, లవ్ ట్రాక్ లు, బూతులు ఇవన్నీ చూసి యూత్ పక్కదారి పట్టే ప్రమాదం ఉందంటున్నారు పేరెంట్స్. బిగ్ బాస్ హౌస్ లో చూపించే ఏ ఒక్కటి కూడా సమాజానికి ఉపయోగపడేది కాదు. పది మందిని ఒక చోటకు తెచ్చి వాళ్ల మధ్య గొడవలు పెట్టించి దాన్ని సమాజం మీదకు వదులుతామంటే ఎలా అంటున్నారు సాధారణ ప్రేక్షకులు. ఇలాంటి షోల వల్ల ఉపయోగం లేకపోగా.. పిల్లలు వాటికి ఎఫెక్ట్ అయి వాళ్ల మైండ్ సెట్ కూడా మారిపోతుందంటున్నారు. ఇందులో ఉండే కంటెస్టెంట్లు వేసుకునే అర్ధనగ్న డ్రెస్సులు, వాళ్ల ఫోజులు, మనుషుల మధ్య ఎలా గొడవలు పెట్టాలో చెప్పే డైలాగులు.. ఇవన్నీ యూత్ ను పెడదోవ పట్టించేవే. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ షోను మూసేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.


Tags

Next Story